![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1001 లో.. రాజీవ్, శైలేంద్ర ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. వాడు మళ్లీ వస్తాడని చెప్పిన నువ్వు పట్టించుకోలేదని రాజీవ్ అనగా.. ఏం చేయమంటావ్ మరి అని శైలేంద్ర అంటాడు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. శైలేంద్ర ప్లాన్ ఫెయిల్ అయిందని ఫ్రస్టేట్ అవుతూ వెళ్ళిపోతాడు.
ఇక ఇంట్లో ఉన్న వసుధార.. రిషి ఫోటోని చూస్తూ ఎమోషనల్ అవుతుంది. కాలేజీని చేయి నుండి జారిపోకుండా చేసుకున్నానని వసుధార అంటుంది. ఆ తర్వాత మనుని చూపిస్తారు. మను వాళ్ళ గ్రాంఢ్ మాతో మాట్లాడుతూ భోజనం చేస్తుంటాడు. తనెవరో కాదు అనుపమ వాళ్ళ పెద్దమ్మ.. మరి మను, అనుపమల మధ్య రిలేషన్ ఏంటో తెలియదు. అయితే అనుపమ వాళ్ళ పెద్దమ్మకి మనుకి మధ్య జరిగిన సంభాషణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. మనుకి భోజనం వడ్డిస్తూ.. ‘అనుపమతో మాట్లాడావా? అని అడుగుతుంది అనుపమ పెద్దమ్మ. ఇక్కడ మను.. ఆ పెద్దమ్మని ముసలి.. ఓల్డీ అని అంటాడు కానీ.. నాన్నమ్మ అని కానీ.. అమ్మమ్మ అని కానీ పిలవడు. అలా పిలిస్తే.. రిలేషన్ ఏంటనేది బయటపడిపోతుంది కాబట్టి జాగ్రత్త పడ్డారు. ఇక రెండో సీన్‌కి వస్తే.. అనుపమ మను గురించే ఆలోచిస్తూ.. వీడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు కొత్త సమస్య మొదలైందని తలపట్టుకుంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి.. మను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. దాంతో అనుపమ కంగారు పడుతుంది.
మనుతో ఇంతకు ముందు పరిచయం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి నుండి లేచివెళ్ళిపోతుంది అనుపమ. మరోవైపు శైలేంద్రకి ధరణి చుక్కలు చూపిస్తుంది. పనిష్మెంట్ అని చెప్పి మడత కుర్చీలో కుర్చోబెడుతుంది. అసలు అనుపమ, మనుల మధ్య బంధమేంటి? డీబీఎస్టీ కాలేజీ కోసం అన్ని కోట్ల చెక్ ఎలా ఇచ్చాడు.. వసుధార, మహేంద్రలకి తెలియని ఈ అజ్ఞాతవ్యక్తి ఎవరనే క్యూరియాసిటితో ఈ సీరియల్ ముగిసింది. మరి అతనెవరో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |